తిరుపతి–వాస్కోడిగామా(గోవా) మధ్య ఎక్స్‌ప్రెస్ రైలును రాష్ట్ర అటవీ శాఖమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గురువారం సాయంత్రం తిరుపతిలో ప్రారంభించారు.
తిరుపతి అర్బన్: తిరుపతి–వాస్కోడిగామా(గోవా) మధ్య ఎక్స్‌ప్రెస్ రైలును రాష్ట్ర అటవీ శాఖమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గురువారం సాయంత్రం తిరుపతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో తిరుపతికి రైల్వే పరంగా తక్కువ ప్రాధాన్యత ఉండేదన్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు.
కొత్త రైళ్లు వస్తున్నాయని, అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయని సంతోషం వ్యక్తంచేశారు. ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ తిరుపతి రైల్వేస్టేషన్ ఆధునీకరణ, దక్షిణం వైపు టీటీడీ సహకారంతో చేపట్టనున్న రైల్వే అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు.