అదుపులోకి రాని అతిసార | The last three days of the 40 people exposed with alcohol | Sakshi
Sakshi News home page

అదుపులోకి రాని అతిసార

Sep 6 2013 5:06 AM | Updated on Oct 9 2018 7:52 PM

మండలంలోని నా గారం గ్రామంలో అతిసార వ్యాధి ఇంకా అ దుపులోకి రావడం లేదు. ప్రతిరోజు పలువు రు వాంతులు విరేచనాలకు గురవుతున్నారు.

దేవరకద్ర, న్యూస్‌లైన్: మండలంలోని నా గారం గ్రామంలో అతిసార వ్యాధి ఇంకా అ దుపులోకి రావడం లేదు. ప్రతిరోజు పలువు రు వాంతులు విరేచనాలకు గురవుతున్నారు. గత మూడు రోజుల్లోనే దాదాపు 40 మంది అ తిసార బారినపడ్డారు. స్థానిక ఆరోగ్య ఉప కేంద్రంలో వైద్యసదుపాయాలు లేక పోవడం తో వైద్యసిబ్బంది రోగుల ఇళ్ల వద్దకు వెళ్లి సె లైన్ ఎక్కిస్తున్నారు.
 
 పరిస్థితి విషమంగా ఉ న్నవారిని దేవరకద్ర పీహెచ్‌సీకి తరలిస్తున్నా రు. ఇంకా పరిస్థితి విషమించిన వారిని జిల్లా ఆస్పత్రికి తరలిస్తున్నారు. గురువారం తా జాగా మరో పదిమందికి అతిసార సోకింది. వీరిలో న లుగురిని జిల్లా ఆస్పత్రికి తరలిం చారు. దేవరకద్ర పీహెచ్‌సీలో మాసమ్మ, కతలమ్మ, దాసు, రాజేశ్వరి, భాగ్యలక్ష్మిలు చి కిత్స పొందుతున్నారు. అలాగే మండలంలో ని అజిలాపూర్ గ్రామానికి చెందిన కురుమూ ర్తి, బస్వాయిపల్లికి చెందిన వెంకటస్వామిలు వాంతులు, విరేచనాలకు గురయ్యారు.
 
  అధికారుల పరిశీలన
 నాగారం గ్రామంలో అతిసారా వ్యాధి అదుపులోకి రాకపోవడంతో జిల్లా జీఈ సెల్ బృం దం గ్రామాన్ని పరిశీలించింది. పారిశుధ్య ప నులు చేపట్టి, మురికి గుంటల్లో బ్లీజింగ్ పౌ డర్ చల్లారు. క్లోరిన్ మాత్రలు పంపిణీచేశా రు. రోగులకు కావాల్సిన సెలైన్ బాటిళ్లు, ఇ తర మందులను పంపిణీచేశారు.  వ్యాధిని అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటామ ని బృందం అధికారి రామ్‌నాయక్ తెలి పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement