ఈ-ప్రజాపంపిణీ | The-distribution | Sakshi
Sakshi News home page

ఈ-ప్రజాపంపిణీ

Jul 31 2014 12:03 AM | Updated on Sep 2 2017 11:07 AM

విశాఖ రూరల్: పారదర్శకతతో పనిచేసేందుకు కేంద్రం ఈ-ప్రజాపంపిణీ పథకం అమలు చేస్తున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

  • మీ-సేవ ద్వారా రేషన్‌కార్డులో మార్పులు, చేర్పులు
  • విశాఖ రూరల్: పారదర్శకతతో పనిచేసేందుకు కేంద్రం ఈ-ప్రజాపంపిణీ పథకం అమలు చేస్తున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్‌కార్డుల్లో మార్పులు చేర్పులను మీ-సేవా కేంద్రాల ద్వారా చేసుకునేందుకు ఇక వీలు కలుగుతుంది.

    ప్రస్తుతమున్న తెలుపు, ఇతర బీపీఎల్ రేషన్‌కార్డులను గులాబీకార్డులుగా మార్చుకునేందుకు, గులాబీ కార్డుల జారీకి, రేషన్‌కార్డుల్లో కుటుంబ సభ్యుని పేరు తొలగింపు, కుటుంబ యజమాని పేరు మార్పునకు, రేషన్‌కార్డులో మార్పులు చేర్పులు, ఎల్‌పీ గ్యాస్ స్థితి మార్పులు చేసుకోవాలనుకొనే వారు మీ-సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

    అలాగే డూప్లికేట్ రేషన్‌కార్డు జారీ, కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు, రేషన్‌డిపో డీలర్ ఆథరైజేషన్ నవీకరణకు, రేషన్‌కార్డు బదిలీకి, రేషన్‌కార్డును అప్పగించడానికి, పుట్టిన పిల్లల, వలస వచ్చిన కుటుంబ సభ్యుల పేర్లు రేషన్‌కార్డులో నమోదుకు మీ-సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement