హత్యలు, పలు పేలుళ్ల కేసుల్లో నిందితుడి గా ఉన్న ఉగ్రవాది మహమ్మద్ ఇజాజ్ అహ్మద్ అలియాస్ అజీజ్‌ను రాష్ట్ర సీఐడీ పోలీసులు కువైట్‌లో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు.
హత్యలు, పలు పేలుళ్ల కేసుల్లో నిందితుడి గా ఉన్న ఉగ్రవాది మహమ్మద్ ఇజాజ్ అహ్మద్ అలియాస్ అజీజ్‌ను రాష్ట్ర సీఐడీ పోలీసులు కువైట్‌లో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఈ వివరాలను సీఐడీ అదనపు డీజీ టి.కృష్ణప్రసాద్ శుక్రవారం వెల్లడించారు. అజంఘోరి స్థాపించిన ఇండియన్ ముస్లిం మహమ్మదీ ముజాహిదీన్(ఐఎంఎంఎం)లో ఇజాజ్ కీలక భూమిక పోషించాడు.
అజంఘోరీతో కలిసి విజయవాడలో 1999లో లక్ష్మీనారాయణ అనే వ్యక్తిని హత్య చేశాడు. దీంతో ఇజాజ్‌ను పోలీసులు 2000లో అరెస్ట్ చేశారు. బెయిల్‌పై విడుదలైన ఇజాజ్ విదేశాలకు పారిపోయాడు. ఇంటర్‌పోల్ ఇచ్చిన సమాచారంతో ఇజాజ్‌ను కువైట్ విమానాశ్రయంలో అరెస్ట్ చేసి రాష్ట్రానికి తీసుకొచ్చినట్లు కృష్ణప్రసాద్ తెలిపారు. నిందితుడ్ని కోర్టులో హాజరుపరిచి చర్లపల్లి జైలుకు తరలించినట్లు చెప్పారు. హైదరాబాద్ మొఘల్‌పురలో కాకతీయ స్వీట్‌హౌస్‌తోపాటు లంబా థియేటర్‌లో బాంబుల ఏర్పాటు, బేగంబజార్‌లో నగల వ్యాపారి మహావీర్ ప్రసాద్ మోడీ హత్య కేసుల్లో ఇజాజ్ పాత్ర ఉన్నట్లు సీఐడీ విచారణలో తేలింది.