టెన్త్ చదువుతున్న ఓ విద్యార్థిని యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
కాకినాడ: టెన్త్ చదువుతున్న ఓ విద్యార్థిని యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ పిఠాపురం ఎస్సీ హాస్టల్లో గురువారం చోటుచేసుకుంది. ఎస్సీ హాస్టల్లో తోటి విద్యార్థినితో గంగ అనే విద్యార్థిని గొడవ పడింది. అనంతరం మనస్థాపానికి గురైన ఆమె యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
గంగ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.