నీటి వాటా తెచ్చుకోకుంటే ఎడారే | Teccukokunte share of water in the desert | Sakshi
Sakshi News home page

నీటి వాటా తెచ్చుకోకుంటే ఎడారే

Jan 8 2015 2:46 AM | Updated on Sep 2 2017 7:21 PM

నీటి వాటా తెచ్చుకోకుంటే ఎడారే

నీటి వాటా తెచ్చుకోకుంటే ఎడారే

రాయలసీమకు రావాల్సిన నీటి వాటాలను తెచ్చుకోకపోతే ఏడారిగా మారక తప్పదని రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు హెచ్చరించారు.

బీకేఎస్ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
 
కడప అగ్రికల్చర్: రాయలసీమకు రావాల్సిన నీటి వాటాలను తెచ్చుకోకపోతే ఏడారిగా మారక తప్పదని రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు  హెచ్చరించారు. బుధవారం కడప నగరంలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో రాయలసీమ రైతు సమస్యలపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భారతీయ కిసాన్ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్రెడ్డి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన పూర్తై తరువాత తీవ్రంగా నష్టపోతున్నది రాయలసీమేనన్నారు.   

బీకేఎం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ  తీవ్ర వర్షాభావంతో బోరుబావులు, చెరువులు, కుంటల్లో నీరు లేకపోవడంతో తాగ టానికి కూడా నీరు లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.  కర్నూలు జిల్లా బీకేఎస్ అధ్యక్షుడు సిద్ధారెడ్ది మాట్లాడుతూ రాయలసీమకు సాగు నీటి పంపిణీ విడుదలలో తీవ్ర అన్యాయం చోటు చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.  అనంతపురం జిల్లా  బీకేఎం  అధ్యక్షుడు నీలకంఠారెడ్డి మాట్లాడుతూ  పాలకుల నిర్లక్ష్యం కారణంగానే సాగునీటి గండం ఏర్పడిందన్నారు.   

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మాట్లాడుతూ  రాయలసీమకు సాగు, తాగునీటి విషయంలో చాలా ఇబ్బందులు వస్తాయని రాష్ట్ర విభజన సమయంలోనే చెప్పామన్నారు.  ఇప్పటికైనా బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం రాయలసీమకు రావాల్సిన నీటి వాటాల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.  ఇరవై సూత్రాల ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్ తులసిరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే 2500 కోట్లు కేటాయించుకునేందుకు ఒత్తిడి తీసుకురాావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.  

సమావేశంలో చిత్తూరు జిల్లా బీకేఎస్ అధ్యక్షుడు సుబ్రమణ్యంరెడ్డి, వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు  బీవీ  శివారెడ్డి,  బీకేఎస్ రాష్ట్ర నాయకులు బొగ్గుల ఓబులరెడ్డి, కుమారస్వామి, వెంకటశివారెడ్డి, రాయలసీమ సాధన సమితి గౌరవాధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డి, నాయకులు ఇరగంరెడ్డి వెంకట్రామిరెడ్డి, బీజేపీ నాయకుడు సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ కమలాపురం నాయకులు సోమశేఖరరెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement