టీడీపీ ఎన్నికల హామీలు అమలు చేయాలి | 'TDP should fulfil its election promises' | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎన్నికల హామీలు అమలు చేయాలి

Feb 25 2015 12:56 AM | Updated on Sep 2 2017 9:51 PM

తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి యూనివర్సిటీల పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ బేసిక్

ఎచ్చెర్ల: తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి యూనివర్సిటీల పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ బేసిక్ అసిసెంట్ ప్రొఫెసర్లకు న్యాయం చేయాలని రాష్ట్ర కాంట్రాక్ట్ బేసిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల యూనియన్ అధ్యక్షుడు డాక్టర్ పి. సుధాకర్ డిమాండ్ చేశారు. వర్సిటీలోని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, టీచింగ్ అసోషియేట్లు, అధ్యాపకులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కామర్స్ మేనేజ్ మెంట్ సెమినార్ హాల్‌లో మంగళవారం సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 990 మంది కాంట్రాక్ట్ బోధకులుగా 13 జిల్లాల్లో వర్సిటీల్లో పనిచేస్తున్నట్లు చెప్పారు.
 
 వీరు శ్రమ దోపిడీకి గురవుతున్నారని చెప్పారు. ప్రభుత్వం నిర్వహించే రిక్రూట్ మెట్లలో వీరికి వెయిటేజీ ఇవ్వాలని, పదేళ్లకు మించి పనిచేస్తున్న అర్హులైన వారిని రెగ్యులర్ చేయాలని, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల మేరకు డాక్టరేట్ ఉన్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రూ. 46500 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్ని వర్సిటీల్లో యూనియన్లు బలోపేతం చేసి భవిష్యత్తులో పోరాట తీవ్రత పెంచుతాయన్నారు.  సమావేశంలో రాష్ట్ర యూనియన్ కార్యదర్శి రవిశంకర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎన్. సంతోష్ రంగనాథ్, కరుణానిధి,  యు. శాంతి, జయలక్ష్మి, ఫిజికల్ డెరైక్టర్ ఎం. శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.
 
 యూనియన్  పునరుద్ధరణ

 వర్సిటీలో గతంలో టీచింగ్ అసోసియేట్ యూనియన్‌ను 2013లో రద్దు చేశారు. మళ్లీ ఈ యూనియన్ పునరుద్ధరించాల ని ఈ సమావేశంలో నిర్ణయించారు. అ న్ని యూనివర్సిటీల్లో యూనియన్లున్నాయని, అంబేద్కర్ యూనివర్సిటీలో సై తం యూనియన్ ఏర్పాటు చేయవల్సి న అవసరం ఉందని రాష్ట్రనాయకత్వం అభిప్రాయ పడింది. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కాం ట్రాక్ట్ బేసిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు యూనియన్ ఏర్పడింది. అధ్యక్షునిగా ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ కోర్సు కో-ఆర్డినేటర్ డాక్టర్ హనుమంతు సుబ్రహ్మణ్యం,  కార్యదర్శిగా ఎంఎల్‌ఐఎస్సీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్. గోవిందరాజులను ఏక గ్రీవంగా ఎన్ను కున్నారు. కాంట్రాక్ట్ బోధకులకు న్యాయం జరిగేవరకూ పోరాడాలని తీర్మానించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement