విశాఖలో ఏడు స్వైన్‌ఫ్లూ కేసులు | swine flu virus spreads to ap from telangana | Sakshi
Sakshi News home page

విశాఖలో ఏడు స్వైన్‌ఫ్లూ కేసులు

Jan 31 2015 1:46 PM | Updated on Sep 2 2017 8:35 PM

విశాఖలో ఏడు స్వైన్‌ఫ్లూ కేసులు

విశాఖలో ఏడు స్వైన్‌ఫ్లూ కేసులు

విశాఖ జిల్లాలో ఇప్పటి వరకు ఏడు స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసులు నమోదయినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ జనార్దన్ నివాస్ వెల్లడించారు.

విశాఖపట్టణం: విశాఖ జిల్లాలో ఇప్పటి వరకు ఏడు స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసులు నమోదయినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ జనార్దన్ నివాస్ వెల్లడించారు. శనివారం ఆయన స్వైన్‌ఫ్లూ వ్యాప్తిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...ఏడు కేసుల్లో రెండు స్వైన్‌ఫ్లూగా నిర్ధారణకాగా, మరో రెండింటి రిపోర్టులు అందాల్సి ఉందని తెలిపారు. మరో రెండు కేసులు నెగిటివ్‌గా తేలాయన్నారు.

 స్వైన్‌ఫ్లూ కేసులు నిర్ధారణ అయిన ప్రాంతాల్లో 14 బృందాలతో స్క్రీనింగ్ పరీక్షలు జరుపుతున్నట్టు జేసీ తెలిపారు.12 బృందాలతో వైద్య శిబిరాలు కూడా నిర్వహించనున్నట్టు చెప్పారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు.  దీంతోపాటు వైద్య సిబ్బందికి మాస్క్‌లు అందజేయనున్నట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement