
సాక్షి, నెల్లూరు : రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని సూరాయపాళెం చెందిన యువత పేర్కొంది. ప్రజల కోసం కాకాణి చేస్తున్న పోరాటాలు మెచ్చి ఆయనకు మద్దతు ఇస్తున్నామన్నారు. రైతుల పట్ల కాకాణి విధానాలకు బాగున్నాయని, ఆయన నాయకత్వంలో అన్ని వర్గాల వారికి న్యాయం జరిగిందన్నారు. అందుతో తామంతా స్వచ్ఛందంగా ఆయనతో మమేకమవ్వడానికి ముందుకొచ్చామని పేర్కొన్నారు. కాకాణి గెలుపే తమ గెలుపని అందుకోసం ఎందాకైనా వెళ్లడానికి సిద్ధమని ప్రకటించారు.