స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు వెళుతున్న ఓ విద్యార్థి ని పాలవ్యాను ఢీకొంది.
లక్కిరెడ్డిపల్లె: స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు వెళుతున్న ఓ విద్యార్థి ని పాలవ్యాను ఢీకొంది. శనివారం ఉదయం లక్కిరెడ్డిపల్లె గంగమ్మ ఆలయం వద్ద జరిగిన ఈ సంఘటనలో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. లక్కిరెడ్డిపల్లెలోని విశ్వభారతి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న చింతల సందీప్ శనివారం ఉదయం పాఠశాలలో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన సందీప్ ను కడప రిమ్స్ కు తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయాలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన పాలవ్యాన్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు.