డీఎస్సీ పరీక్ష రాస్తూ విద్యార్థి మృతి | student died while writing exam | Sakshi
Sakshi News home page

డీఎస్సీ పరీక్ష రాస్తూ విద్యార్థి మృతి

May 9 2015 3:52 PM | Updated on Nov 9 2018 4:36 PM

మూర్ఛవ్యాధితో బాధపడుతున్న ఒక విద్యార్థి డీఎస్సీ పరీక్ష రాస్తూ మృతిచెందిన సంఘటన కర్నూలులో శనివారం జరిగింది.

కర్నూలు : మూర్ఛవ్యాధితో బాధపడుతున్న ఒక విద్యార్థి డీఎస్సీ పరీక్ష రాస్తూ మృతిచెందిన సంఘటన కర్నూలులో శనివారం జరిగింది. వివరాల ప్రకారం...కర్నూలు జిల్లా నందవరం మండలం గురజాల గ్రామానికి చెందిన చిన్నరాముడు కుమారుడు అనోక్ కుమార్‌కు మూర్ఛవ్యాధి ఉంది. అయితే తను డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాడు. వారం రోజుల క్రితం కర్నూలుకు వచ్చి స్నేహితుని గదిలో ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం కర్నూలు నగరంలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో పరీక్ష రాస్తుండగా మధ్యాహ్నం 12.30 గంటలకు వాంతి చేసుకుని మూర్ఛపోయాడు. అధికారులు వెంటనే అనోక్ కుమార్‌ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలోపే అతను మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement