సీఎం అధ్యక్షతన ఎస్‌ఐపీబీ పునరుద్ధరణ | State Investment Promotion Board Re-constituted with CM YS Jagan as chairman | Sakshi
Sakshi News home page

సీఎం అధ్యక్షతన ఎస్‌ఐపీబీ పునరుద్ధరణ

Dec 9 2019 8:00 PM | Updated on Dec 9 2019 9:05 PM

State Investment Promotion Board Re-constituted with CM YS Jagan as chairman - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ)ను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, జి.జయరాం, మేకపాటి గౌతమ్‌రెడ్డి, బాలినేని శ్రీనివాసుల రెడ్డి సభ్యులుగా నియమించారు. సంబంధిత శాఖల కార్యదర్శులను ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. ఎస్‌ఐపీబీ కన్వీనర్‌గా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎస్‌ఐపీబీ ప్రతీ నెలా ఒకసారి సమావేశమై కీలకమైన పెట్టబడుల ప్రతిపాదనలను ఆమోదం తెలుపుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement