శ్రీవారి సేవలో ప్రధాని సోదరుడు | Srivari the service of the Prime Minister's brother | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో ప్రధాని సోదరుడు

Feb 2 2015 2:29 AM | Updated on Nov 9 2018 6:29 PM

శ్రీవారి సేవలో ప్రధాని సోదరుడు - Sakshi

శ్రీవారి సేవలో ప్రధాని సోదరుడు

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్న సోమాభాయ్ మోదీ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.

సాక్షి,తిరుమల : ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్న సోమాభాయ్ మోదీ  ఆదివారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలసి ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజ స్తంభానికి మొక్కుకుని, తర్వాత గర్భాలయ మూలమూర్తి, వకుళ మాతను దర్శించుకున్నారు. హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా, అధికారులు వారికి ప్రసాదాలు అందజేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement