
శ్రీవారి భక్తుల కోసం విమాన సర్వీసులు
దేశ, విదేశాల నుంచి తిరుమలకు వచ్చే ప్రయాణికుల సౌకర్యం కోసం నూతన విమాన సర్వీసులు ప్రారంభిస్తామని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోకగజపతిరాజు తెలిపారు.
- కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోకగజపతిరాజు
సాక్షి, తిరుమల: దేశ, విదేశాల నుంచి తిరుమలకు వచ్చే ప్రయాణికుల సౌకర్యం కోసం నూతన విమాన సర్వీసులు ప్రారంభిస్తామని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోకగజపతిరాజు తెలిపారు. ఆయన ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుపతి విమానాశ్రయంలో జూన్‌లోపు కొత్త టెర్మినల్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. విభజన చట్ట ప్రకారం ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుందని, ఆర్థిక ఇబ్బందులతో కొంత జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. హామీల విషయంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తెలిపారు. ఈ విషయంలో కేంద్రంపై అభాండాలు వేయడం ప్రతిపక్షాలకు తగదని హితవు పలికారు.