సొంతింటి కల నెరవేరుస్తాం: శ్రీరంగనాథరాజు

Sri Ranganatha Raju Said AP Government Will Build 25 Lakh Houses - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: రాష్ట్రంలో 25 లక్షలమందికి ఇంటి నిర్మాణాలను పూర్తి చేయడమే లక్ష్యమని గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. మంగళవారం ఏలూరులో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 34,879 మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆయన అన్నారు. 1,12,700 మంది ఇళ్ల స్థలాలు ఉండి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఒంటరి, వితంతు, వికలాంగులకు ఇంటి నిర్మాణం పూర్తిగా ప్రభుత్వమే నిర్మించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. భూ సేకరణ, గ్రూప్ హౌస్‌ల నిర్మాణం ద్వారా ప్రతి ఒక్కరికీ సొంతింటి కల నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top