వైఎస్సార్‌ జిల్లా నూతన ఎస్పీగా అన్బురాజన్‌ | SP Anburajan Says Severe Actions On Illegal Activities | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ జిల్లా నూతన ఎస్పీగా అన్బురాజన్‌

Oct 11 2019 12:56 PM | Updated on Oct 11 2019 1:32 PM

SP Anburajan Says Severe Actions On Illegal Activities  - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ : వైఎస్సార్‌ జిల్లా నూతన ఎస్పీ గా అన్బురాజన్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో జిల్లా ఎస్పీగా పనిచేసిన అభిషేక్‌ మొహంతి సుదీర్ఘ సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో అన్బురాజన్‌ ఎస్పీగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత కేసులను పరిశీలించి వాటి పురోగతిపై దృష్టి పెడతానని పేర్కొన్నారు. నగరంలోని ట్రాఫిక్‌పై దృష్టి సారిస్తానని, సమస్య ఏదైనా నిర్భయంగా తన దగ్గరకు రావచ్చని తెలిపారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో మరింత మెరుగైన టెక్నాలజీని ఉపయోగించి నేరాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తామన్నారు. చట్టానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని స్ఫష్టం చేశారు. ఇసుక అక్రమ రవాణ, మట్కా, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని వెల్లడించారు.  వైఎస్‌ వివేకానంద హత్య కేసుపై  పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించి త్వరలోనే వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement