'మా దగ్గర డబ్బులుంటే ఇచ్చేసేవాళ్లం'

హైదరాబాద్: ఒక్కో కుటుంబానికి రూ.లక్షా యాభైవేల వరకు రుణమాఫీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఒక్కో కుటుంబంలో ఎన్నిఖాతాలు ఉన్నా ఒక్క రుణమాఫీ మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. రుణమాఫీకి అర్హులైనవారి వివరాలు ఇవ్వాలని బ్యాంకులను కోరినట్టు చెప్పారు.
రాష్ట్రంలో రుణాలు తీసుకున్న రైతులు 80 లక్షల మంది ఉన్నారని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. పంట, డ్వాక్రా, మిగతా రుణాల కోసం సుమారు రూ.37 వేల కోట్లు అవసరమవుతాయని భావిస్తున్నట్టు చెప్పారు. తమ దగ్గర డబ్బులు ఉంటే ఇప్పుడే ఇచ్చేసేవాళ్లమని అన్నారు.
రుణమాఫీ నిధుల సమీకరణ కోసం రేపు కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. వీలైనంత తొందర్లో రుణమాఫీ అమలు చేస్తామన్నారు. ఒకే పొలం విషయంలో రుణమాఫీ కౌలు రైతుకే వర్తిస్తుందని వివరించారు. సంస్కరణలు కొనసాగిస్తామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
సంబంధిత వార్తలు