టీజీ నివాసంలో సీమాంధ్ర మంత్రులు భేటీ | Seemandhra state ministers meeting at T.G.Venkatesh house | Sakshi
Sakshi News home page

టీజీ నివాసంలో సీమాంధ్ర మంత్రులు భేటీ

Sep 8 2013 12:18 PM | Updated on Sep 1 2017 10:33 PM

రాష్ట్ర మంత్రి టీ.జీ.వెంకటేష్ నివాసంలో ఆదివారం ఉదయం సీమాంధ్రకు చెందిన మంత్రులు సమావేశమైయ్యారు.

రాష్ట్ర మంత్రి టీ.జీ.వెంకటేష్ నివాసంలో ఆదివారం ఉదయం సీమాంధ్రకు చెందిన మంత్రులు సమావేశమైయ్యారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోల సంఘం శనివారం హైదరాబాద్లో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు వచ్చిన అపూర్వ స్పందనపై వారు ఈ సందర్భంగా చర్చించారు.

 

అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చేపట్టవలసిన విధి విధానలపై వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. అందులోభాగంగా భవిష్యత్తు కార్యచరణపై చేపట్టవలసిన అంశాలపై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు చర్చించారు. సీమాంధ్ర మంత్రులు కాసు వెంకట కృష్ణారెడ్డి, వట్టి వసంత కుమార్, అనం రామనారాయణ రెడ్డి,ఏరాసు ప్రతాప రెడ్డి తదితరులు పాల్లొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement