కాకినాడకు జనసాధారణ్‌ రైళ‍్లు | Sankranti special trains between Kakinada Port-Secunderabad Jansadharan special | Sakshi
Sakshi News home page

కాకినాడకు జనసాధారణ్‌ రైళ‍్లు

Jan 12 2017 9:08 AM | Updated on Apr 7 2019 3:24 PM

దక్షిణ మధ‍్య రైల‍్వే సికింద్రాబాద్‌-కాకినాడ మధ్య ప్రత్యేక జనసాధారణ్‌ రైళ్లు నడుపుతోంది.

హైదరాబాద్ : సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని గురువారం నుంచి దక్షిణ మధ‍్య రైల‍్వే సికింద్రాబాద్‌-కాకినాడ మధ్య ప్రత్యేక జనసాధారణ్‌ రైళ్లు నడుపుతోంది. సికింద్రాబాద్‌-కాకినాడ (07086/07089) ఈ నెల 12వ తేదీ రాత్రి 11.30 కు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.40 కి కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 17వ తేదీ సాయంత్రం 4.30 కు కాకినాడ నుం‍చి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.30 కు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

మరో ట్రైన్‌ కాకినాడ -సికింద్రాబాద్‌ (07201) 17వ తేదీ రాత్రి 10.30 కు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.50 కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. మరో ట్రైన్‌ కాకినాడ-సికింద్రాబాద్‌ (02775) 18వ తేదీ సాయంత్రం 6.30 కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం​ 7.40 కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.


 

Advertisement
 
Advertisement
Advertisement