వారిపై అధికార పార్టీ కక్ష సాధింపు.. | Ruling party doing un reasonable actions on ration dealers | Sakshi
Sakshi News home page

వారిపై అధికార పార్టీ కక్ష సాధింపు..

Jul 11 2017 1:05 PM | Updated on Sep 5 2017 3:47 PM

కర్నూలు జిల్లా నంద్యాలలో అధికార పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు.

నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాలలో అధికార పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. 17మంది రేషన్‌ డీలర్లపై కక్షసాధింపునకు పాల్పడ్డారు. వీరి రేషన్‌ షాపులపై రెవెన్యూ అధికారులు దాడులు చేసి బయో మెట్రిక్‌ మిషన్లను తీసుకెళ్లారు. డీలర్లపై ఫిర్యాదులొచ్చాయని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇస్తుండడంతో వీరిపై అధికారులు దాడులు చేశారు. కాగా, అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష కౌన్సిలర్లను కూడా వదలడంలేదు.

స్థానిక 18వ వార్డు కౌన్సిలర్‌ సుబారాయుడు ఇంటిపై గత రాత్రి వందల సంఖ్యలో పోలీసులు దాడులు చేశారు. ఇంట్లో ఉన్న రూ.5.5 లక్షలను తీసుకెళ్లారు. ఆ డబ్బుకు ఆధారాలు చూపినా పట్టించుకోకుండా తీసుకెళ్లారని కౌన్సిలర్‌ వాపోయారు. నంద్యాల ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అధికార పార్టీ ఈ విధమైన దారుణాలకు ఒడిగట్టిందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement