మహబూబ్‌నగర్ జిల్లాలోని అడ్డాకుల మండలం కొమ్మిరెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తాపడిన ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మహబూబ్ నగర్ : జిల్లాలోని అడ్డాకుల మండలం కొమ్మిరెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తాపడిన ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 35 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి తాడిపత్రికి బయలు దేరింది.
ఈ క్రమంలోనే అర్ధరాత్రి తరువాత కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలోని బ్రిడ్జి వద్దకు రాగానే బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షత గాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.