కర్నూలు జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠా గుట్టును పోలీసులు శనివారం రట్టు చేశారు.
కర్నూలు : కర్నూలు జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠా గుట్టును పోలీసులు శనివారం రట్టు చేశారు. ముఠా సభ్యుల నుంచి 60 తులాల బంగారంతోపాటు 3 కేజీల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.