కర్నూలు జిల్లాలో అరుదైన పాము గుర్తింపు

Rare snake in Nallamala Forest - Sakshi

శ్రీశైలం ప్రాజెక్ట్‌: కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతం సున్నిపెంట పరిధిలో రామాలయం సమీపంలో అరుదైన పామును బయోల్యాబ్‌ సిబ్బంది గుర్తించారు. సమాచారం అందుకున్న బయోల్యాబ్‌ రేంజ్‌ అధికారి ఎ.ప్రేమ అక్కడికి చేరుకుని పామును పట్టుకున్నారు. ఈ పామును మొదటిసారిగా.. నాగార్జునసాగర్, శ్రీశైలం అభయారణ్యంలో గుర్తించామని, దీని శాస్త్రీయ నామం లైకోడాన్‌స్లావికోల్లీస్‌ అని తెలిపారు. దీనిని ఎల్లోకలర్డ్‌ ఊల్ఫ్‌ స్నేక్‌గా పేర్కొంటారని, వీటిల్లో 5 రకాల జాతులుంటాయని, ఇవి విషపూరితం కాదని చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top