ఎస్సై నాగరాజు సస్పెన్షన్‌ | ramachandrapuram SI Nagaraju suspended in Jakkampudi raja attack incident | Sakshi
Sakshi News home page

ఎస్సై నాగరాజు సస్పెన్షన్‌

Nov 10 2017 6:02 PM | Updated on Sep 2 2018 3:42 PM

ramachandrapuram SI Nagaraju suspended in Jakkampudi raja attack incident - Sakshi

కాకినాడ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై దౌర్జన్యం చేసి గాయపర్చిన కేసులో తూర్పు గోదావరి జిల్లా రామచంద్ర పురం ఎస్సై పి.నాగరాజుపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ విశాల్‌ గున్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సెప్టెంబర్‌ 30న రామచంద్రపురంలో రోడ్డుపక్కన కారు నిలిపి చంటి బిడ్డను ఎత్తుకొని ఉన్న రాజాపై ఎస్సై నాగరాజు దూకుడుగా వ్యవహరించి గాయపర్చిన విషయం తెలిసిందే. ఎస్సైను అరెస్టు చేసి సస్పెండ్‌ చేయాలంటూ పార్టీ నేతలు పోలీసు స్టేషన్ల వద్ద నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎస్సైని వీఆర్‌లోకి పంపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement