ఏపీ సర్కారుపై సర్దేశాయ్ ప్రశంసల జల్లు

Rajdeep sardesai praises YS Jagan on 1088 new ambulances - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించడానికి, అందులోనూ అత్యంత క్లిష్ట సమయంలో కొత్త 108, 104 అంబులెన్సు సర్వీసులను ప్రారంభించడాన్ని ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయి అభినందించారు. ఒకేసారి 1088 ఆంబులెన్స్‌లను ప్రవేశపెట్టిన విషయంపై ఆయన ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. బుధవారం ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కరోనా వైరస్​పై పోరాటంలో మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని అన్నారు. (ఆరోగ్య చరిత్రలో సువర్ణాధ్యాయం ప్రారంభం

కొత్తగా ప్రారంభించిన 1088 అంబులెన్స్‌లు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తాయన్న విషయాన్ని సర్దేశాయి ప్రస్తావించారు. వీటిని స్థానిక ఆరోగ్య కేంద్రాలు, డాక్టర్లతో అనుసంధానం చేశారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకుని మిగతా రాష్ట్రాలు ఇదే బాటలో నడుస్తాయని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. (‘అమరరాజా’కు షాక్‌; 253.61 ఎకరాలు వెనక్కి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top