ఆ స్టేషన్‌ను ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేయాలి

That Railway Station Must Be Developed Worldwide Range Said By YSRCP MP Vara Parasad In Tirupathi - Sakshi

తిరుపతి: తిరుపతి రైల్వే స్టేషన్‌ను వెంటనే ప్రపంచస్థాయి స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని వైఎస్సార్‌సీపీ తిరుపతి ఎంపీ వరప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో ఆమరణ దీక్ష అనంతరం మొదటి సారి చిత్తూరు జిల్లాకు వచ్చిన ఎంపీ వరప్రసాద్‌కు వైఎస్సార్సీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. విలేకరులతో మాట్లాడుతూ..రోజుకు లక్ష మంది ప్రయాణికులు తిరుపతి రైల్వేస్టేషన్‌కు వస్తుంటారని అన్నారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్‌లో తగిన సౌకర్యాలు లేవని చెప్పారు. తిరుపతి రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనుల మీద తరచూ అధికారులతో సమీక్ష చేస్తున్నానని వెల్లడించారు.

తిరుపతి ఆర్‌సీ రోడ్డులో సబ్‌వే ఏర్పాటుకు గట్టిగా కృషి చేస్తున్నాని తెలిపారు. తర్వలోనే సబ్‌వే పనులు ప్రారంభం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ ఎంపీ వరప్రసాద్‌కు శ్రీకాళహస్తి వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్‌ బియ్యపు మధుసూదన్‌ రెడ్డి ఘన సన్మానం చేశారు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top