భీమవరం సభకు రాహుల్‌ | Rahul Gandhi attend public meeting in Bhimavaram | Sakshi
Sakshi News home page

భీమవరం సభకు రాహుల్‌

May 25 2017 8:55 PM | Updated on Mar 18 2019 8:51 PM

భీమవరం సభకు రాహుల్‌ - Sakshi

భీమవరం సభకు రాహుల్‌

భీమవరం సభకు కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హజరు కానున్నారు.

- పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: జూన్‌ 4న భీమవరంలో కాంగ్రెస్‌ నిర్వహించనున్న సభకు కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జూన్‌ 4న భీమవరంలో కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, గురువారం ఆయన న్యూఢిల్లీలో ఎంపీ కేవీపీ రామచంద్రారావు నివాసంలో పార్టీ నేతలు టి సుబ్బిరామిరెడ్డి, జేడీశీలం, కోట్ల విజయభాస్కర్‌రెడ్డిలతో కలసి మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు కాంగ్రెస్‌ పార్టీ చివరి దాకా పోరాడుతుందని రఘువీరరెడ్డి చెప్పారు. భీమవరం సభకు జాతీయ స్థాయి నేతలు సీపీఎం, సీపీఐ, సమాజ్‌వాదీ పార్టీతో పాటు ప్రత్యేక హోదాకు మద్దతు పలికిన అన్ని పార్టీల ముఖ్య నేతలూ హాజరవుతారని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement