రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శుల పోస్టులకోసం కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చిపడ్డాయి.
	1,055 పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు 5.66 లక్షల మంది పోటీ
	
	సాక్షి అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శుల పోస్టులకోసం కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చిపడ్డాయి. 1,055 పోస్టులకు కోసం నోటిఫికేషన్ జారీ చేయగా.. 5,66,215 మంది దరఖాస్తు చేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్‌టీ సాయి తెలిపారు.
	
	వీరికి ఈనెల 23వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష (స్క్రీనింగ్ టెస్టు) నిర్వహించనున్నారు. ఈ స్క్రీనింగ్ టెస్టులో అర్హత సాధించిన వారి నుంచి 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మెయిన్స్‌ను జూలై 16న ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
