మళ్లీ మొదలైన ఇసుక రవాణా.. | People in the villages of the zone and the smuggling of sand | Sakshi
Sakshi News home page

మళ్లీ మొదలైన ఇసుక రవాణా..

Sep 30 2013 3:38 AM | Updated on Sep 1 2017 11:10 PM

మండలంలోని ప లు గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా మళ్లీ జోరందుకుంది. మానేరువాగు నుంచి యథావిధిగా ఇసు క రవాణా జరుగుతున్నా అధికారులెవరూ పట్టిం చుకోవడంలేదు.

 కరీంనగర్ రూరల్, న్యూస్‌లైన్ : మండలంలోని ప లు గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా మళ్లీ జోరందుకుంది. మానేరువాగు నుంచి యథావిధిగా ఇసు క రవాణా జరుగుతున్నా అధికారులెవరూ పట్టిం చుకోవడంలేదు. ఇటీవల దుర్శేడ్‌లో ఇసుక మాఫి యా చేతిలో మృతి చెందిన న్యాలం కుమార్‌గౌడ్ సంఘటనతో కొన్ని రోజులపాటు ఇసుక అక్రమ ర వాణాకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
 
 అయితే నా లుగు రోజుల నుంచి సుల్తానాబాద్ మండలం గొ ల్లపల్లి, గట్టెపల్లి, నీరుకుల్ల, గర్రెపల్లి, కరీంనగర్ మండలం ఎలగందల్, ఖాజీపూర్, చేగుర్తి గ్రామాల్లోని మానేరువాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. రాజీవ్ రహదారి నుంచే ప్ర తీరోజు వందలాది ట్రాక్టర్లు కరీంనగర్‌కు దర్జాగా వెళ్తున్నా పోలీస్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదు.
 
 
 శనివారం మంత్రి శ్రీధర్‌బాబు మం థని వెళ్తుండగా బందోబస్తు కోసం వచ్చిన రూరల్ సీఐ కమలాకర్‌రెడ్డి , ఎస్సై సృజన్‌రెడ్డి బైపాస్‌రోడ్డు వద్ద ఎనిమిది ట్రాక్టర్లను పట్టుకున్నారు. అయినా యథావిధిగానే ట్రాక్టర్లు నడిచాయి. ఆదివారం ఉ దయం 8గంటలకు మొగ్ధుంపూర్ స్టేజీవద్ద ఇసుక ట్రాక్టర్ అతివేగంతో రోడ్డు దాటుతుండగా అడ్డుగా వచ్చిన క్వాలిస్ వాహనాన్ని ఢీకొట్టి బోల్తాపడింది. దాదాపు అరగంటపాటు ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది.  ఈ సంఘటనలో రోడ్డుపక్కనే ద్విచక్రవాహనంపై ఉన్న మరో ట్రాక్టర్ యజమాని కాలు విరిగింది.
 
 క్వాలిస్‌లోని ముగ్గురు వ్యక్తులకు గా యాలయ్యాయి. రూరల్ పోలీసులు వచ్చి ప్రమాదతీరును పరిశీలించారు. ప్రమాదాలకు కారణమవుతున్న ఇసుక ట్రాక్టర్లు గ్రామంలోనుంచి రావద్దని మొగ్ధుంపూర్ గ్రామస్తులు గొల్లపల్లి ట్రాక్టర్ యజ మానులతో వాగ్వాదానికి దిగారు. ట్రాక్టర్ల రాకతో రోడ్లు చెడిపోతున్నాయని, ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇసుక ట్రాక్టర్లు గ్రామం నుంచి వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement