ఆరు నెలల్లోనే బాబు పాలనపై వ్యతిరేకత : వైఎస్ జగన్


ఎంత త్వరగా ఈ ప్రభుత్వం పోతే అంత మేలని ప్రజలంటున్నారు

కర్నూలు జిల్లా సమీక్షా సమావేశంలో వైఎస్ జగన్

తమ తరఫున పోరాడమని ప్రజలు కోరుతున్నారు

ప్రజా సమస్యలపై పోరాడదాం


సాక్షి ప్రతినిధి, కర్నూలు: చంద్రబాబు పాలన మాకొద్దు బాబోయ్.. అంటూ ప్రజలు విసుగెత్తిపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. ఒక ప్రభుత్వానికి కేవలం ఆరు నెలల కాలంలోనే ఇంతటి వ్యతిరేకత బహుశా దేశ చరిత్రలోనే మొదటిసారని ఆయన అభిప్రాయపడ్డారు. వివిధ ప్రజాసమస్యలపై కలసి పోరాడదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కర్నూలులోని మెగాసిరి ఫంక్షన్ హాలులో శుక్రవారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ప్రసంగించారు.

 

 రెండు రోజులపాటు సాగే సమీక్షా సమావేశాల్లో భాగంగా తొలిరోజు నంద్యాల పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి విడివిడిగా మాట్లాడారు. మధ్యాహ్నం 12 గంటలకు మొదలైన సమావేశాలు రాత్రి 10 గంటల వరకూ సాగాయి. ఈ సందర్భంగా జగన్‌మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏ వుుఖ్యవుంత్రికైనా, ప్రభుత్వానికైనా ప్రజా వ్యతిరేకత రావాలంటే కనీసం రెండేళ్లు పడుతుందన్నారు. అరుుతే, చంద్రబాబు ప్రభుత్వానికి వూత్రం ఆరు నెలలు తిరగకుండానే ప్రజా వ్యతిరేకత ప్రారంభమైందన్నారు. ఎన్నికల వుుందు బాబు ఇచ్చిన మోసపు వాగ్దానాలకు, అబద్ధాలకు విసుగెత్తి ప్రజలందరూ తవు తరఫున పోరాటం చేయూలని ఒత్తిడి తెచ్చే పరిస్థితి ఏర్పడిందని ఆయన వివరించారు.

 

 అందుకే వునం ప్రజలకు తోడుగా నిలబడాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. ఎనిమిది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయుని లెక్కిస్తే.. చంద్రబాబు కూటమికి కోటీ 35 లక్షల ఓట్లు వచ్చాయని, వునకు కోటీ 30 లక్షల ఓట్లు వచ్చాయన్నారు. తేడా కేవలం 5 లక్షల ఓట్లు వూత్రమేనన్నారు. కేవలం కడప పార్లమెంటు సెగ్మెంటులో తనకు వచ్చిన మెజార్టీ 5 లక్షల 45 వేలని గుర్తుచేశారు. చంద్రబాబు మాదిరిగా రూ.87 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేస్తామని అబద్ధపు వాగ్దానాలు, హామీలు ఇవ్వనందుకే ఈ తేడా వచ్చిందన్నారు. పట్టణ, నగర ప్రాంతాల్లో బీజేపీ నేత నరేంద్రమోదీ గాలి కూడా చంద్రబాబుకు కలసి వచ్చిందన్నారు. సీఎం కావాలనే కోరిక ఎవరికైనా బలంగా ఉంటుందని.. అయితే సీఎం కావడం కోసం ఏ అబద్ధమైనా ఆడదాం... ఏ గడ్డైనా తిందావునే ఆలోచన తనకు లేదని జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ విధంగా అధికారంలోకి వస్తే ఐదేళ్ల తర్వాత ఇంటికి పంపిస్తారని చంద్రబాబుకు హితవు పలికారు. బాబు పరిస్థితి దినదినగండంగా ఉందని.. ప్రజల్లోకి వెళితే రాళ్లతో కొట్టకుండా చూసుకునేందుకు రోజుకో అబద్ధం ఆడుతున్నారని విమర్శించారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా పనిచేసిన ఆరేళ్లలోనే ప్రజలు మరిచిపోలేని ఎన్నో మంచిపనులు చేసి, అందరి గుండెల్లో నిలిచిపోయారని తెలిపారు. అందుకే పేదలందరూ వైఎస్సార్ ఫొటోను ఇళ్లల్లో పెట్టుకుని పూజిస్తున్నారని అన్నారు. ‘నాకు కూడా సీఎంగా 30 ఏళ్లపాటు ప్రజా రంజకమైన పాలన అందించి, చనిపోయిన తర్వాత ప్రజల మనసుల్లో, ఇళ్లల్లో నాన్న ఫొటో పక్కనే నా ఫొటో కూడా పెట్టుకుని పూజించుకునే విధంగా మంచిపనులు చేయాలని ఉంది..’ అని వ్యాఖ్యానించారు. జిల్లాలో పార్టీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై న్యాయపోరాటం చేద్దామని భరోసానిచ్చారు.

 

 ఈ సమీక్షా సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైసూరా రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సీజీసీ సభ్యులు, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి, ఎమ్మెల్యేలు సాయిప్రసాద్ రెడ్డి, గౌరు చరిత, ఎస్వీ మోహన్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఐజయ్య, మణిగాంధీ, అఖిలప్రియ, గుమ్మనూరు జయరాం, జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, సీఈసీ సభ్యులు కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, హఫీజ్ ఖాన్, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని జ్యోతి, యువజన విభాగం నేత పుత్తా ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top