కొండచిలువ కలకలం 

People Afraid Of Python In Tativaripalem Prakasam - Sakshi

సాక్షి, ప్రకాశం : మండలంలోని తాటివారిపాలెంలో సోమవారం ఉదయం వ్యవసాయం భూముల్లో కొండచిలువ కనిపించగా స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. తాటివారిపాలెం గ్రామానికి చెందిన బాదరాజుపల్లి ఉదయమ్మ గ్రామ సమీపంలోని కొండ దిగువ భాగాన తమ వ్యవసాయ భూమిలో మినుము పంట కోసేందుకు మనుషులతో వెళ్లింది. పంట కోత సమయంలో మినప చెట్ల మధ్య చుట్టు చుట్టుకొని ఉన్న కొండ చిలువను చూసి భయంతో కోతను ఆపేసి ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు.

అద్దంకి నుంచి తాటివారిపాలెం చేరుకున్న ఫారెస్ట్‌ బీట్‌ అధికారులు ఆంజనేయులు, శ్రీనివాసరావు 15 అడుగుల పొడవు ఉన్న కొండ చిలువను ఖాళీ గోనె సంచిలో బంధించి కొండపై భాగాన ఉన్న అటవీ ప్రాంతంలో వదిలేయడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఫారెస్ట్‌ అధికారులు మాట్లాడుతూ మార్టూరులోని అమరావతి నూలు మిల్లులో కనిపించిన కొండచిలువ కోసం రెండు రోజులుగా వెతికినా దొరకలేదన్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top