పెన్షన్‌దారుల ఉసురు తప్పదు | Pensandarula must usuru | Sakshi
Sakshi News home page

పెన్షన్‌దారుల ఉసురు తప్పదు

Sep 26 2014 4:18 AM | Updated on Sep 2 2017 1:57 PM

ఆయన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు అక్టోబర్ 2 నుంచి పెంచిన పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి ప్రస్తుతం నిబంధనల పేరుతో లక్షలాది మందిని తొలగిస్తున్నారని అన్నా రు.

పీలేరు : సీఎం చంద్రబాబునాయుడుకు రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షన్‌దారుల ఉసురు తప్పదని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం పీలేరు మండల పరిషత్ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు అక్టోబర్ 2 నుంచి పెంచిన పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి ప్రస్తుతం నిబంధనల పేరుతో లక్షలాది మందిని తొలగిస్తున్నారని అన్నా రు.

రుణమాఫీపై తొలిసంతకం చేసిన బాబు రైతులను, డ్వాక్రా మహిళలను నిండా ముంచేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 14 స్మార్ట్ సిటీలు, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు నిర్మిస్తామని చెప్పి న చంద్రబాబు వంద రోజుల పాలనలో చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలకు బిల్లులు, సిమెంట్ ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారన్నారు.

నిరుద్యోగ భృతి, వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ గాలికొదిలేశారని విమర్శించారు. వైస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు, నాయకులకు అండ గా ఉంటామని హామీ ఇచ్చారు. పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎంపీపీ కే.మహితాఆనంద్, జెడ్పీటీసీలు రెడ్డిబాషా, జయరామచంద్రయ్య పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement