పాలకొల్లులో ఘరానా చోరీ | palakollu bank theft | Sakshi
Sakshi News home page

పాలకొల్లులో ఘరానా చోరీ

Mar 14 2014 2:13 AM | Updated on Sep 2 2017 4:40 AM

పాలకొల్లులో ఘరానా చోరీ

పాలకొల్లులో ఘరానా చోరీ

దొంగలు ఘరానా చోరీకి పాల్పడిన ఘటన పాలకొల్లులో సంచలనం కలిగించింది. ఎన్నికల ప్రత్యేక బృందమంటూ ఓ ప్రైవేట్ సంస్థ ఉద్యోగి నుంచి రూ.4 లక్షలు దొంగలు ఎత్తుకుపోయూరు.

ఎన్నికల ప్రత్యేక బృందమంటూ తనిఖీలు
ప్రైవేట్ సంస్థ ఉద్యోగి నుంచి రూ.4 లక్షలు అపహరణ
సంస్థ సొమ్మును బ్యాంక్‌లో డిపాజిట్ చేసేందుకు వెళ్తున్న ఉద్యోగి
 

 పాలకొల్లు టౌన్, న్యూస్‌లైన్ :
 దొంగలు ఘరానా చోరీకి పాల్పడిన ఘటన పాలకొల్లులో సంచలనం కలిగించింది. ఎన్నికల ప్రత్యేక బృందమంటూ ఓ ప్రైవేట్ సంస్థ ఉద్యోగి నుంచి రూ.4 లక్షలు దొంగలు ఎత్తుకుపోయూరు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని కృష్ణాజీ మల్టీఫ్లెక్స్‌లో ఉన్న శ్రీరామ్ చిట్స్ నుంచి గురువారం సంస్థ ఉద్యోగి పోడూరు మండలానికి చెందిన గుబ్బల శ్రీనివాస్ రూ.10 లక్షల సొమ్మును బ్యాగ్‌లో పెట్టుకుని ఆంధ్రా బ్యాంక్ పట్టణ బ్రాంచ్‌లో డిపాజిట్ చేసేందుకు వెళ్లాడు.
 
 బ్యాంక్ దగ్గరలో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు అతని వద్దకు వచ్చి తాము ఎన్నికల ప్రత్యేక బృందమని.. పెద్ద మొత్తంలో సొమ్మును ఎక్కడ నుంచి తీసుకువస్తున్నావని వారు ప్రశ్నిం చినట్లు శ్రీనివాస్ చెబుతున్నాడు. ఈ సొమ్ము చిట్‌ఫండ్ కంపెనీకి చెందింద ని, బ్యాంక్‌లో జమ చేసేందుకు తీసుకెళుతున్నట్లు వారికి చెప్పినట్లు తెలిపా డు. దాంతో ఆ ముగ్గురు వ్యక్తులు బ్యాగ్‌ను తెరిపించి కరెన్సీ నోట్లను వాసన చూసి తిరిగి పెట్టినట్లు నటించి బ్యాగ్‌ను చేతికి ఇచ్చారని చెప్పాడు.
 
 బ్యాంక్‌లోకి వెళ్తూ బ్యాగ్‌లో సొమ్ము చూసుకున్న శ్రీనివాస్ రూ.4 లక్షలు అపహరణకు గురైనట్లు గుర్తించి పోలీ సులకు ఫిర్యాదు చేసినట్లు సీఐ కేటీటీవీ రమణ తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారించినట్లు సీఐ చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి.భగవాన్‌ప్రసాద్ తెలిపారు. ఇదిలావుండగా చోరీపై అనుమానాలు వ్యక్తమవుతున్నారుు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement