breaking news
sri ram chits
-
శ్రీరాం ఫైనాన్స్ లో భారీ చోరీ
-
శ్రీరాం ఫైనాన్స్ లో భారీ చోరీ
కాకినాడ మండల కేంద్రంలోని పిఠాపురం రోడ్డులో ఉన్న శ్రీరాం ట్రాన్స్పోర్ట్ అండ్ ఫైనాన్స్ కంపెనీలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ చోరీ జరిగింది. మెయిన్ రూం కిటికీ గ్రిల్స్ తొలగించి రూ.17 లక్షల నగదు..220 గ్రాముల బంగారు నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. కాకినాడ ఎఎస్పీ దామోదర్ సంఘటనాస్థలానికి క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. -
పాలకొల్లులో ఘరానా చోరీ
ఎన్నికల ప్రత్యేక బృందమంటూ తనిఖీలు ప్రైవేట్ సంస్థ ఉద్యోగి నుంచి రూ.4 లక్షలు అపహరణ సంస్థ సొమ్మును బ్యాంక్‌లో డిపాజిట్ చేసేందుకు వెళ్తున్న ఉద్యోగి పాలకొల్లు టౌన్, న్యూస్‌లైన్ : దొంగలు ఘరానా చోరీకి పాల్పడిన ఘటన పాలకొల్లులో సంచలనం కలిగించింది. ఎన్నికల ప్రత్యేక బృందమంటూ ఓ ప్రైవేట్ సంస్థ ఉద్యోగి నుంచి రూ.4 లక్షలు దొంగలు ఎత్తుకుపోయూరు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని కృష్ణాజీ మల్టీఫ్లెక్స్‌లో ఉన్న శ్రీరామ్ చిట్స్ నుంచి గురువారం సంస్థ ఉద్యోగి పోడూరు మండలానికి చెందిన గుబ్బల శ్రీనివాస్ రూ.10 లక్షల సొమ్మును బ్యాగ్‌లో పెట్టుకుని ఆంధ్రా బ్యాంక్ పట్టణ బ్రాంచ్‌లో డిపాజిట్ చేసేందుకు వెళ్లాడు. బ్యాంక్ దగ్గరలో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు అతని వద్దకు వచ్చి తాము ఎన్నికల ప్రత్యేక బృందమని.. పెద్ద మొత్తంలో సొమ్మును ఎక్కడ నుంచి తీసుకువస్తున్నావని వారు ప్రశ్నిం చినట్లు శ్రీనివాస్ చెబుతున్నాడు. ఈ సొమ్ము చిట్‌ఫండ్ కంపెనీకి చెందింద ని, బ్యాంక్‌లో జమ చేసేందుకు తీసుకెళుతున్నట్లు వారికి చెప్పినట్లు తెలిపా డు. దాంతో ఆ ముగ్గురు వ్యక్తులు బ్యాగ్‌ను తెరిపించి కరెన్సీ నోట్లను వాసన చూసి తిరిగి పెట్టినట్లు నటించి బ్యాగ్‌ను చేతికి ఇచ్చారని చెప్పాడు. బ్యాంక్‌లోకి వెళ్తూ బ్యాగ్‌లో సొమ్ము చూసుకున్న శ్రీనివాస్ రూ.4 లక్షలు అపహరణకు గురైనట్లు గుర్తించి పోలీ సులకు ఫిర్యాదు చేసినట్లు సీఐ కేటీటీవీ రమణ తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారించినట్లు సీఐ చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి.భగవాన్‌ప్రసాద్ తెలిపారు. ఇదిలావుండగా చోరీపై అనుమానాలు వ్యక్తమవుతున్నారుు.