బైక్‌ను ఢీ కొన్న లారీ | one dies and one injured in accident | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీ కొన్న లారీ

May 6 2015 3:30 PM | Updated on Sep 3 2017 1:33 AM

రోడ్డుపై ఆగి ఉన్న బైక్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది.

తల్లి మృతి, కుమారుడు పరిస్థితి విషమం
వైఎస్సార్ జిల్లా: రోడ్డుపై ఆగి ఉన్న బైక్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన బుధవారం వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలం గంగురాజుపురం ప్రధాన రహదారిపై జరిగింది. వివరాలు.. రఘురాజపురం గ్రామానికి చెందిన సుబ్బరత్న(50) తన పెద్ద కొడుకు వెంకటేష్‌తో కలిసి మంగంపేట వెళ్తున్నారు. ఈ క్రమంలోనే రోడ్డుపై ఆగి ఉండగా వెనుక నుంచి వచ్చిన లారీ వీరి బైక్‌ను ఢీ కొట్టింది.

దీంతో సుబ్బరత్న అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన వెంకటేష్‌ను మెరుగైన వైద్యం కోసం 108లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(రైల్వేకోడూరు)

Advertisement
 
Advertisement
Advertisement