ఓఎన్జీసీ బావి నుంచి గ్యాస్ లీకేజీ | once again gas leakage in ongc well at antarvedi | Sakshi
Sakshi News home page

ఓఎన్జీసీ బావి నుంచి గ్యాస్ లీకేజీ

Jun 4 2016 9:40 AM | Updated on Sep 4 2017 1:40 AM

తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ లీకేజీ స్థానికులను ఆందోళనకు గురి చేసింది.

సఖినేటిపల్లి: తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ లీకేజీ స్థానికులను ఆందోళనకు గురి చేసింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలోని ఓఎన్జీసీ నాలుగో నంబర్ బావి నుంచి గ్యాస్ లీకేజీ సంభవించింది.

శనివారం ఉదయం బావి నుంచి గ్యాస్‌ను తీసుకెళ్లే పైప్‌లైన్‌కు చిన్న రంధ్రం పడడంతో గ్యాస్ పైకి ఎగచిమ్మింది. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఓఎన్జీసీ సిబ్బంది అరగంటలో ఆ లీకేజీని మూసేశారు. పైప్‌లైన్‌కు తుప్పుపట్టడంతోనే ఈ సమస్య ఏర్పడినట్టు తెలుస్తోంది. ఇక్కడ మూడు పైప్‌లైన్లకు గాను రెండింటిని మార్చారు. మూడో లైన్‌కు కొత్త పైపులు వేయాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement