ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి స్వల్ప అస్వస్థత | MLA giddi eswari minor illness | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి స్వల్ప అస్వస్థత

Aug 8 2014 12:44 AM | Updated on May 3 2018 3:17 PM

ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి స్వల్ప అస్వస్థత - Sakshi

ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి స్వల్ప అస్వస్థత

పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గొంతు, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బుధవారం రాత్రి చేరారు.

విశాఖపట్నం, మెడికల్ : పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గొంతు, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బుధవారం రాత్రి చేరారు. వైద్య పరీక్షల అనంతరం వైద్యులు ఆమె జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నట్టు వెల్లడించారు. ఆమెను గురువారం చింతపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు పద్మకుమారి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు కర్ణంనాయుడు, జీకేవీధి, చింతపల్లి, కొయ్యూరు, జి.మాడుగుల, పాడేరులకు చెందిన పలువురు ఎంపీటీసీ సభ్యులు పరామర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement