‘అందుకే లోకేష్‌ను ప్రజలు ఓడించారు’ | MLA Alla Ramakrishna Reddy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

మోడల్‌ మున్సిపాలిటీలుగా తాడేపల్లి, మంగళగిరి

Sep 27 2019 2:08 PM | Updated on Sep 27 2019 3:00 PM

MLA Alla Ramakrishna Reddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: తాడేపల్లి, మంగళగిరిలను మోడల్‌ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం  మీడియాతో మాట్లాడుతూ.. రూ.1500 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం జగన్‌  తెలిపారన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ నిర్మాణంలో ఉన్నారని..ఇక్కడి అభివృద్ధిపై రివ్యూ చేయలేదని ఆర్కే అన్నారు. ఇదే రోడ్లపై చంద్రబాబు తిరిగారని..కానీ పైసా కేటాయించలేదని విమర్శించారు. అందుకే మంగళగిరి ప్రజలు లోకేష్‌ను ఓడించారని పేర్కొన్నారు. రెండునెలల్లోనే సీఎం జగన్‌ ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement