వివాహిత ఆత్మహత్య | Married woman suicide | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Feb 29 2016 12:24 AM | Updated on Sep 3 2017 6:37 PM

మండలంలోని ధర్మపురం గ్రామానికి చెందిన వివాహిత ఆదివారం వేకువజామున ఉరేసుకుని ఆత్మహత్యకు

ఇచ్ఛాపురం రూరల్: మండలంలోని ధర్మపురం గ్రామానికి చెందిన వివాహిత ఆదివారం వేకువజామున ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఇచ్ఛాపురం రూరల్ ఎస్సై ఎం.చిన్నంనాయుడు తెలిపారు.  కొంత కాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న సాడి సరస్వతి(23) మందులు వాడుతుండేదని చెప్పారు. శనివారం అర్ధ రాత్రి నుండి కడుపునొప్పి తీవ్రతగా ఉండటంతో తట్టుకోలేక పోయిన సరస్వతి ఆదివారం వేకువ జామున తన నివాసం మేడపైన చున్నీతో ఉరివేసుకుని చనిపోయినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక ఉప తహశీల్దార్ గణపతి, ఎస్సై ఎం.చిన్నం నాయుడు శవ పంచనామాకు తరలించారు. భర్త కువైట్‌లో ఉంటున్నారని, వారికి రెండు సంవత్సరాల అబ్బాయి ఉన్నట్లు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement