వివాహిత ఆత్మహత్య | married woman suicide | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Jul 6 2015 1:44 AM | Updated on Sep 3 2017 4:57 AM

వివాహమైన ఆరేళ్లు కావస్తున్నా సంతానం కలుగక పోవడంతో మనస్తాపం చెందిన మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పెనుగొండ మండలం

 సంతాన ప్రాప్తిలేదనే మనస్తాపంతో..
 ములపర్రు(పెనుగొండ రూరల్) : వివాహమైన ఆరేళ్లు కావస్తున్నా సంతానం కలుగక పోవడంతో మనస్తాపం చెందిన మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పెనుగొండ మండలం ములపర్రులో జరిగింది. ఎస్సై సీహెచ్ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం ములపర్రుకు చెందిన కట్టా వీర్రాఘవులు, అనురాధ(26)కు ఆరేళ్ల  క్రితం వివాహమైంది.  వీరికి సంతానం కలుగలేదు. వైద్య పరీక్షల్లోనూ వీరికి సంతానం కలిగే అవకాశాలు లేవని తెలియడంతో ఆనురాధ మనస్తాపానికి గురైంది. టెస్ట్‌ట్యూబ్ బేబీకి ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఈలోపు తోడికోడలు గర్భం దాల్చడంతో ఆమె మరింత కుంగిపోయింది. శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొంది. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి పంపినట్టు ఎస్సై తెలిపారు. ఘటనా స్థలాన్ని నర్సాపురం డీఎస్పీ పి.సౌమ్యలత, పెనుగొండ సీఐ సీహెచ్ రామారావు పరిశీలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement