కంప్యూటర్ రంగంలో వచ్చే సరికొత్త మార్పులను అందిపుచ్చుకోవాల్సిన అవసరం నేటి యువతపై ఎంతైనా ఉందని ఏపీ పోలీసు అకాడమీ డెరైక్టర్ డాక్టర్ ఎం.మాల కొండయ్య తెలిపారు.
హైదరాబాద్: కంప్యూటర్ రంగంలో వచ్చే సరికొత్త మార్పులను అందిపుచ్చుకోవాల్సిన అవసరం నేటి యువతపై ఎంతైనా ఉందని ఏపీ పోలీసు అకాడమీ డెరైక్టర్ డాక్టర్ ఎం.మాల కొండయ్య తెలిపారు. జెట్‌కింగ్ అమీర్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్ బ్రాంచ్‌ల పదవ వార్షికోత్సవం రవీంద్రభారతిలో ఆదివారం నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాలకొండయ్య మాట్లాడుతూ, టెక్నాలజీ నేడు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైందన్నారు. జెట్‌కింగ్ వారు యువతకు కంప్యూటర్ రంగంలో శిక్షణ ఇవ్వటం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా జెట్‌కింగ్ సంస్థలో శిక్షణ తీసుకున్న అంధ విద్యార్థి నరసింహులు కంప్యూటర్‌లోని వివిధ భాగాలను వేరు చేసి, తిరిగి కలిపిన దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పలువురు అతడిని అభినందించారు. చివర్లో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.