
ముఖ్యంగా కరోనా కష్ట కాలంలో చేతుల్లో కత్తెర్లతో.. అటు సెలబ్రిటీలతో పాటు సామాన్యులు తమ వాళ్లకు క్షవరం చేస్తున్నారు.
సాక్షి, రాజంపేట: కరోనా లాక్‌డౌన్‌తో అన్ని సేవలు, సర్వీసులు రద్దయ్యాయి. దాంతో ఇంటికే పరిమితమైన జనం అవసరానికి తగినట్టు తమని తాము సంస్కరించుకుంటున్నారు. ప్రాణాంతక వైరస్‌ను తరిమికొట్టాలంటే.. సామాజిక దూరం తప్పనిసరి కావడంతో.. తమ పనులను తామే చేసుకుని ఔరా! అనిపిస్తున్నారు. ముఖ్యంగా కరోనా కష్ట కాలంలో చేతుల్లో కత్తెర్లతో.. అటు సెలబ్రిటీలతో పాటు సామాన్యులు తమ వాళ్లకు క్షవరం చేస్తున్నారు. దాంతోపాటు ఆ ఫొటోలను సరదాగా సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. తాజాగా తన భర్తకు క్షవరం చేసిన వైఎస్సార్ జిల్లా రాజంపేటకు చెందిన ఓ ఇల్లాలు ఔరా అనిపించారు. ఇక ఇప్పటికే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి హెయిర్ కట్ చేసిన అనుష్క శర్మ ఫొటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
(చదవండి: న్యూ కట్)