
మృగంలా మారాడు
వ్యసనాల మత్తులో చిత్తయ్యాడు. విచక్షణ కోల్పోయాడు. తాను చదువుతున్న న్యాయశాస్త్ర పరువునూ మంటగలిపాడు.
న్యాయ విద్యార్థినిపై సహచరుని అత్యాచారం
నగరంలో కలకలం
వ్యసనాల మత్తులో చిత్తయ్యాడు. విచక్షణ కోల్పోయాడు. తాను చదువుతున్న న్యాయశాస్త్ర పరువునూ మంటగలిపాడు. మద్యం సేవించి మృగంగా మారాడు. నిద్రిస్తున్న సహచర విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. సరదాగా వ్యవహరిస్తూ కలసిమెలసి ఉంటున్న మిత్రుడే రాక్షస అవతారమెత్తడంతో బాధిత విద్యార్థిని నిర్ఘాంతపోయింటది.
కన్నీరుమున్నీరయింది. ఈ ఘోరసంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన దామోదరం సంజీవయ్య కళాశాలలో బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగింది. న్యాయ విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన విద్యార్థి లోకంలో సంచలనమైంది.