కేజీ బేసిన్ నుంచి రిలయన్స్ తరలించుకు పోతున్న గ్యాస్లో ఆంధ్రప్రదేశ్కు రావల్సిన వాటా..
విజయవాడ: కేజీ బేసిన్ నుంచి రిలయన్స్ తరలించుకు పోతున్న గ్యాస్లో ఆంధ్రప్రదేశ్కు రావల్సిన వాటాను దక్కించుకుంటే ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిలయన్స్ నుంచి వాటా రాబట్టలేక ప్రజలపై భారం మోపుతున్నారని ఆయన విమర్శించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్, పెట్రోల్ ఛార్జీల పెంపుపై ఉద్యమించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ధరలను పెంచుతున్నారంటూ దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో బాబు రాగానే జాబు ఇస్తానన్న చంద్రబాబు ఉన్న జాబులను పీకేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ, టీడీపీలు ప్రజలకు నమ్మక ద్రోహం చేశాయని మధు విమర్శించారు.