పెళ్లి మండపంలో భారీ చోరీ జరిగింది. | jewelry theft in Kalyanamadapam | Sakshi
Sakshi News home page

కళ్యాణ మండపంలో నగలు చోరీ

Dec 2 2015 9:02 AM | Updated on Jun 1 2018 8:39 PM

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని వాసవి ధర్మశాల కళ్యాణ మండపంలో భారీ చోరీ జరిగింది.

పెళ్లి మండపంలో భారీ చోరీ జరిగింది. పెళ్లి కూతురుకు చెందిన మూడు నక్లెస్‌లను గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని వాసవి ధర్మశాల కళ్యాణ మండపంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానిక కళ్యాణమండపంలోకర్ణాటక కొల్లగల్‌కు చెందిన మానసకు హిందూపురానికి చెందిన అక్షిత్‌తో బుధవారం తెల్లవారుజామున పెళ్లి జరగనుంది.

దీనికోసం బందువులంతా కళ్యాణ మండపానికి చేరుకున్నారు. అక్కడ పెళ్లి కూతురు పెద్దమ్మ రాధ తన వెంట తెచ్చిన మూడు నక్లెస్‌లను గదిలో పెట్టి స్నానానికి వెళ్లింది. తిరిగి వచ్చి చూసేసరికి తలుపులు పగలగొట్టి గుర్తు తెలియని దుండగులు నగలు ఎత్తుకె ళ్లారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. గత వారం ఇదే కుటుంబానికి చెందిన మరో వివాహవేడుకలో కూడా 20 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురవడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement