హత్యా.. ఆత్మహత్యా ? | It is muder... sucide? | Sakshi
Sakshi News home page

హత్యా.. ఆత్మహత్యా ?

Jun 28 2015 3:29 AM | Updated on Aug 11 2018 8:06 PM

హత్యా.. ఆత్మహత్యా ? - Sakshi

హత్యా.. ఆత్మహత్యా ?

అనంతపురం జిల్లా వాసి మదనపల్లెలో హత్యకు గురయ్యాడు...

మదనపల్లెలో అనంతపురం జిల్లా వాసి మృతి
- అనుమానాస్పద కేసుగా నమోదు
- కూలి పనుల కోసం వచ్చి కడతేరిన వైనం
మదనపల్లె  రూరల్ :
అనంతపురం జిల్లా వాసి మదనపల్లెలో హత్యకు గురయ్యాడు. కూలి పనుల కోసం వచ్చి కడతేరిపోయాడు. ఆ వ్యక్తిని పథకం ప్రకారం ఉరి వేసి చంపి కొండకు సమీపంలోని ఓ ఇందిరమ్మ ఇంట్లో పడేసి వెళ్లారు. మదనపల్లెలో శనివారం కలకలం రేపిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ... అనంతపురం జిల్లా కనగానిపల్లె మండలం వేపకుంటకు చెందిన పిండి లింగన్న అలియాస్ రెడ్డీస్ (55) వారం రోజుల క్రితం కూలి పనుల కోసమంటూ కుటుంబ సభ్యులతో చెప్పి మదనపల్లెకు వచ్చాడు. చంద్రాకాలనీ సమీపంలో ఉంటూ కూలి పనులు చేసుకునేవాడు.

ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పథకం ప్రకారం లింగన్నకు ఉరివేసి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని పథకం ప్రకారం తట్టివారిపల్లె సమీపంలో ఇందిరమ్మ కాలనీని ఓ ఇంట్లో పడేసి వెళ్లారు. గొర్రెల కాపర్లు మృతదేహాన్ని  శనివారం ఉదయం 11.30 గంటలకు గుర్తించి స్థానికంగా ఉన్న  హోంగార్డుకు చెప్పారు. అతడు టూ టౌన్ సీఐ హనుంతునాయక్, ఎస్‌ఐలు నాగేశ్వరావు, గంగిరెడ్డిలకు సమాచారం అందించారు. వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా ఉరి తీసినట్లు స్పష్టంగా ఉన్నట్లు గుర్తించారు. మృతుని జేబులో సెల్‌ఫోన్ లభించింది. ఫోన్ నెంబర్ల ఆధారంగా మృతుడు అనంతపురం జిల్లావాసిగా గుర్తించి బంధువులకు సమాచారం అందించారు.  అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తర లించారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ, ఎస్‌ఐలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement