ఇన్‌పుట్ సబ్సిడీ రూ.1.66 కోట్లు | Input subsidy Rupes 1.66 crores | Sakshi
Sakshi News home page

ఇన్‌పుట్ సబ్సిడీ రూ.1.66 కోట్లు

May 23 2014 1:52 AM | Updated on Sep 2 2017 7:42 AM

మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇన్‌పుట్ సబ్సిడీ నిధులు విడుదలయ్యాయి. 2011 నుంచి ఇప్పటి వరకు వడగండ్ల వానతో పంటలు నష్టపోయిన 1999 మంది రైతులకు ప్రభుత్వం రూ.1.66 కోట్ల మొత్తాన్ని విడుదల చేసిందని జేడీఏ ఠాగూర్ నాయక్ గురువారం ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.

కర్నూలు(సిటీ), న్యూస్‌లైన్: మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇన్‌పుట్ సబ్సిడీ నిధులు విడుదలయ్యాయి. 2011 నుంచి ఇప్పటి వరకు వడగండ్ల వానతో పంటలు నష్టపోయిన 1999 మంది రైతులకు ప్రభుత్వం రూ.1.66 కోట్ల మొత్తాన్ని విడుదల చేసిందని జేడీఏ ఠాగూర్ నాయక్ గురువారం ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.
 
 2011 మే లో ఓర్వకల్లు మండలంలో పంటలు కోల్పోయిన ఐదుగురు రైతులకు రూ.18,600, 2012 మార్చి, ఏప్రిల్‌లో పాణ్యం, మహానంది, బండి ఆత్మకూరు మండలాల్లో 776 మంది రైతులకు రూ.36,47,500, అలాగే 2013 ఫిబ్రవరిలో బనగానపల్లె, నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా మండలాల్లో  పంటలు నష్టపోయిన 1218 మంది రైతులకు రూ.64 లక్షల పరిహారం పంపిణీ చేయనున్నట్లు జేడీఏ తెలిపారు.
 

Advertisement

పోల్

Advertisement