
‘సార్... మా ప్రాంతంలో స్థానిక పరిశ్రమలు లేక జీడి, కొబ్బరి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో ప్రజలు తిత్లీ తుపాను కారణంగా ఉపాధి అవకాశాలు కోల్పోయారు’ అని పలాసకు చెందిన గేదెల ఖుష్బూ జగన్‌కు చెప్పారు. అర్హులకు పరిహారం అందలేదని, మీరు అధికారంలోకి వచ్చాక ఆదుకోవాలని కోరారు.