ఆడు మగాడ్రా.. బుజ్జి | I can't forget in my life that moments with Nagabhusana sharma, says Tanikalla bharani | Sakshi
Sakshi News home page

ఆడు మగాడ్రా.. బుజ్జి

Mar 23 2015 5:11 AM | Updated on Sep 2 2017 11:14 PM

ఆడు మగాడ్రా.. బుజ్జి

ఆడు మగాడ్రా.. బుజ్జి

ఎవరైనా కోపంగా కొడతారు..బలంగా కొడతారు... వీడేంట్రా చాలా శ్రద్దగా కొట్టాడు. ఏదో గోడకడుతున్నట్లు,

 ‘ఎవరైనా కోపంగా కొడతారు..బలంగా కొడతారు... వీడేంట్రా చాలా శ్రద్దగా కొట్టాడు. ఏదో గోడకడుతున్నట్లు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్లు చాలా జాగ్రత్తగా, పద్ధతిగా కొట్టాడ్రా.. ఆడు మగాడ్రా బుజ్జి’.. అతడు సినిమాలో అలరించిన డైలాగులివి. హీరో మహేష్‌బాబునుద్దేశించి విలన్ పాత్రధారి తనికెళ్ల భరణి తనదైన శైలిలో చెప్పారు. అవే డైలాగుల్ని ఆదివారం విశ్వకవి రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్లో విద్యార్థుల ఆత్మీయ అవగాహన సదస్సులో చెప్పి ఉర్రూతలూగించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం కిక్-2తోపాటు రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న మరో సినిమాలో నటిస్తున్నట్లు తనికెళ్ల భరణి పేర్కొన్నారు. తన గురువు డాక్టర్ నాగభూషణశర్మతో కలిసి భీమవరం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు.
 
  గురువుతో కలిసి వచ్చి ఒక వేదికపై మాట్లాడటం జీవితంలో మరువలేనిదన్నారు. హైదరాబాద్‌లో నాటక కళాపరిషత్‌లో భీమవరానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ బొమ్మిడి నారాయణరావుతో కలిసి నాటకాలు నేర్చుకుంటున్న సమయంలో నాగభూషణశర్మ ప్రిన్సిపాల్‌గా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రోత్సాహంతోనే చిత్రసీమలో ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. గురువును విస్మరించకుండా భక్తితో గౌరవించినప్పుడే జీవితంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. ఆయన వెంట డాక్టర్ నాగభూషణశర్మ, స్నేహితుడు మాజీ ఎమ్మెల్సీ బొమ్మిడి నారాయణరావు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement