భార్యను చంపిన భర్తకు యావజ్జీవ శిక్ష | husband sentenced life in wife murder case | Sakshi
Sakshi News home page

భార్యను చంపిన భర్తకు యావజ్జీవ శిక్ష

Nov 1 2013 6:27 PM | Updated on Sep 2 2017 12:12 AM

భార్యను చంపిన భర్తకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. 10 వేల జరిమానా విధిస్తూ జిల్లా అదనపు కోర్టు తీర్పు వెలువరించింది.

ఆలంపల్లి: భార్యను చంపిన భర్తకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. 10 వేల జరిమానా విధిస్తూ జిల్లా అదనపు కోర్టు తీర్పు వెలువరించింది.  ఎస్పీ రాజకుమారి తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ మండలం పులుమామిడికి చెందిన మొత్కుపల్లి అంజయ్య, మల్లమ్మ దంపతులు. అనుమానంతో అంజయ్య తరచూ భార్యను వేధిస్తుండేవాడు.

ఈక్రమంలో 2011 మే 20 ఆయన భార్యకు ఉరి వేసి చంపేశాడు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు అప్పట్లో సీఐ రామకృష్ణ కేసును దర్యాప్తు చేసి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. శుక్రవారం కేసు పూర్వాపరాలు పరిశీలించిన జిల్లా అదనపు జడ్జి  ఉదయగౌరి పైవిధంగా తీర్పు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement